అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో గురువారం ఉదయం 11 గంటలకు గేట్లు ఎత్తనున్నట్లు డ్యాం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు. ప్రాజెక్ట్ దిగువన గోదావరి నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో చేపలు పట్టడానికి వెళ్లొద్దని, పశువుల కాపరులు, రైతులు నది వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.