అక్షరటుడే, ఆర్మూర్ : Expulsion of Gowda caste : గౌడ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం అన్యాయమని తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్(Telangana State BC, SC, ST, Minority Welfare Forum State President Bussapur Shankar) అన్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలోని బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. రోజురోజుకు వీడీసీ(VDC)ల అరాచక పరిపాలన(anarchic administration) ఎక్కువ అవుతోందన్నారు. ఈ నియంతృత్వ పాలన(dictatorial rule) అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు సైద్గర్ శ్రీనివాస్, నరేందర్, జిల్లా కార్యదర్శి చిందకింది సంతోష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ నవీన్ చారి, జిల్లా నాయకులు దాసరి రాజేష్ , నల్ల మోహన్ , అంకార్ గణేష్ , నిజామాబాద్ నగర అధ్యక్షుడు చంద్రకాంత్, వడ్ల రాజేష్ , ఆర్ముర్ నవీన్ తదితరులున్నారు.
Expulsion of Gowda caste | గౌడ కులస్థుల గ్రామ బహిష్కరణ అన్యాయం
Advertisement
Advertisement