Eye tests | చిన్నారులకు కంటి పరీక్షలు

Eye test | చిన్నారులకు కంటి పరీక్షలు
Eye test | చిన్నారులకు కంటి పరీక్షలు

అక్షరటుడే, ఇందూరు: Eye tests | దృష్టిలోపం ఉన్న విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పిల్లల్లో కంటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల పాఠశాల విద్యార్థులకు తరగతుల వారీగా ఆర్​బీఎస్​కే RBSK ఆధ్వర్యంలో కంటి పరీక్షలు eye tests పూర్తి చేసింది. ఇదే తరహాలో ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి పరీక్షల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. అంగన్​వాడీ కేంద్రాల్లోను వైద్య పరీక్షలు చేయనుంది.

Advertisement
Advertisement

Eye tests | జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రాజెక్టులు

జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రాజెక్టులున్నాయి. సుమారు 1,500 అంగన్​వాడీ కేంద్రాలు Anganwadi centers కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 1.02 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ కంటి పరీక్షలు చేయనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆదేశాలతో ఈ నెల 7 నుంచి ప్రతి అంగన్​వాడీ కేంద్రంలో ఆర్​బీఎస్​కే RBSK బృందాలు పర్యటించనున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  CP Sai Chaitanya | అర్ధరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు

Eye tests | పరీక్షలకు 15 బృందాలు…

చిన్నారుల కంటి పరీక్షలకు childrens eye tests మొత్తం 15 బృందాలు పనిచేయనున్నాయి. ఒక్కో బృందంలో పది మంది సిబ్బంది ఉంటారు. నిత్యం 150 మంది చిన్నారులను పరీక్షించనున్నారు. ప్రధానంగా కంటిచూపు, కార్నియా లోపాలను గుర్తించి అవసరమైన వారికి జీజీహెచ్ లేదా సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. లోపాలు తీవ్రంగా ఉంటే సర్జరీ కూడా చేయిస్తారు.

Eye tests | ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తాం

- సచిన్, ఆర్​బీఎస్​కే మేనేజర్
– సచిన్, ఆర్​బీఎస్​కే మేనేజర్

– సచిన్, ఆర్​బీఎస్​కే మేనేజర్
జిల్లాలోని అంగన్​వాడీ కేంద్రాల్లో Anganwadi centers ప్రతి చిన్నారికి కంటి పరీక్ష చేస్తాం. అవసరం ఉన్నవారికి జిల్లా జనరల్ ఆస్పత్రి లేదా సమీప దవాఖానాలకు రిఫర్ చేస్తాం. ఏప్రిల్ 7 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Advertisement