అక్షరటుడే, ఇందూరు: నకిలీ గల్ఫ్ ఏజెంట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ కల్మేశ్వర్ ఒక ప్రకటనలో సూచించారు. లైసెన్స్ లేని సంస్థలు, ఏజెంట్లు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నకిలీ జాబ్‌లెటర్లు చూపించి మోసగిస్తున్నారని తెలిపారు. గల్ఫ్ ఏజెంట్లు, సంస్థలకు ఇళ్లు, షాపులు అద్దెకు ఇచ్చే సమయంలో యజమానులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ఇవ్వాలన్నారు. వీసాల పేరిట ఎవరైనా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.