అక్షరటుడే, కామారెడ్డి టౌన్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని పలువురిని మోసగించిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుంచు ప్రవీణ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తనకు తెలిసిన వారిని నమ్మించారు. సుమారు 15 మంది నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. ఎలాంటి ఉద్యోగాలు కల్పించకపోగా.. ఫేక్ జాబ్ లెటర్లు అందజేసి పత్తాలేకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సుంచు ప్రవీణ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.