KAMAREDDY | గూగుల్ మ్యాప్​ను చూస్తూ దారితప్పారు..
KAMAREDDY | గూగుల్ మ్యాప్​ను చూస్తూ దారితప్పారు..
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి : KAMAREDDY | గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణం చేసిన ఓ కుటుంబం కష్టాలపాలైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​ ఈసీఐఎల్​కు చెందిన ఓ కుటుంబం బాసర సరస్వతి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేసేందుకు బయలుదేరింది. అయితే వారికి దారి తెలియకపోవడంతో గూగుల్​ మ్యాప్​ను ఆధారంగా చేసుకుని శుక్రవారం తెల్లవారుజామున కారులో బయలుదేరారు.

KAMAREDDY | భిక్కనూరు పట్టణం వైపు..

అయితే భిక్కనూరు వద్దకు రాగానే జాతీయ రహదారి గుండా కాకుండా భిక్కనూరు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వైపు నుంచి అంతంపల్లి గ్రామం వెళ్లే దారిని గూగుల్​ మ్యాప్​ చూపించింది. దీంతో వారు అలాగే వెళ్లగా అదుపుతప్పిన కారు పొదల్లోకి దూసుకెళ్లింది. మట్టిలో ఇరుక్కుపోయిన కారులో నుంచి అతికష్టంమీద బయటకు వచ్చిన వారు.. రోడ్డుపైకి వచ్చి 100కి ఫోన్​ చేశారు. దీంతో పోలీసులు వచ్చి జేసీబీ సహాయంతో కారును బయటకు తీయించారు. అనంతరం వారు అదే కారులో బాసరకు బయలుదేరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Collector | విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి