అక్షరటుడే,వెబ్‌డెస్క్: singer suicide attempt : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఆమె నివాసముంటున్నారు.
అయితే రెండురోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి అపస్మారకస్థితిలో ఉన్న కల్పనను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.