India Vs New Zealand : టీమిండియా గెలుపు కోసం పూజ‌లు.. గంగా న‌దికి హారతులు ఇచ్చి పూజ చేస్తున్న ఫ్యాన్స్

India Vs New Zealand : టీమిండియా గెలుపు కోసం పూజ‌లు.. గంగా న‌దికి హారతులు ఇచ్చి పూజ చేస్తున్న ఫ్యాన్స్
India Vs New Zealand : టీమిండియా గెలుపు కోసం పూజ‌లు.. గంగా న‌దికి హారతులు ఇచ్చి పూజ చేస్తున్న ఫ్యాన్స్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ India Vs New Zealand : మరి కొద్ది నిమిషాల‌లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ ఫైట్ జ‌ర‌గ‌నుంది. భార‌త్, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు, ట్రోఫీ ఎవ‌రు ఎత్తుతారు అన్న‌దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన టీమిండియా, ఛాంఫియన్స్‌ ట్రోఫీని ముద్దాడాలంటే బ్లాక్‌ క్యాప్స్ ఖాతాలో మ‌రో ఓట‌మి చేరాల్సిందే. ఇది కొడితే దెబ్బ మాములుగా ఉండ‌దు. అయితే ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో భార‌త్ నెగ్గాల‌ని అభిమానులు పూజ‌లు చేస్తున్నారు. టీమిండియా గెలుపు కోసం ఉజ్జయినిలోని బగలాముఖి ఆలయం, కాశీ విశ్వేశ్వరుని మందిరంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు.

India Vs New Zealand : అంత‌టా పూజ‌లు..

గంగా నదికి హారతులు ఇచ్చి, ప్రార్థనలు కూడా నిర్వ‌హిస్తున్నారు.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ రెండు జట్ల ప్లేయర్లు సమజ్జీవులుగా కనిపిస్తున్నారు. సైకత శిల్పంతో.. భారత్‌కు ఆల్ ది బెస్ట్ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ పోరుకు అంతా సన్న‌ద్ధ‌మైంది. ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని ప్రదర్శించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దుబాయ్ స్టేడియం, ట్రోఫీతో పాటు వైట్ బాల్ కనిపించేలా ఇసుక శిల్పాన్ని రూపొందించి, టీమిండియాకి బెస్ట్ విషెస్ చెప్పాడు. మొత్తానికి అభిమానులు కూడా టీమిండియా గెల‌వాల‌ని కోరుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  KL Rahul : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడటా..!

వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి చాలా డేంజర్ కాగా, అత‌ను న్యూజిలాండ్ టీంకు‌ పెను సవాలుగా మారబోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్ బౌలింగ్ సెటప్ అద్భుతంగా ఉందన్న ఆయన.. చక్రవర్తి బౌలింగ్‌లో న్యూజిలాండ్ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. గ్రూప్-దశ మ్యాచ్‌లో కివీస్‌పై వరుణ్ చక్రవర్తి 10-0-42-5తో అసాధారణ గణాంకాలను న‌మోదు చేయ‌డం మ‌నం చూశాం. మ‌రోవైపు ఫైన‌ల్ గురించి బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా బెట్టింగ్స్ ఊపందుకున్నాయి. భార‌త్ వైపే ఎక్కువ‌గా బెట్టింగ్ న‌డుస్తుంది. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలోనూ జోరుగా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement