NTR | గోల చేసిన ఫ్యాన్స్.. చిరు కోపం ప్ర‌ద‌ర్శించిన ఎన్టీఆర్

NTR | గోల చేసిన ఫ్యాన్స్.. చిరు కోపం ప్ర‌ద‌ర్శించిన ఎన్టీఆర్
NTR | గోల చేసిన ఫ్యాన్స్.. చిరు కోపం ప్ర‌ద‌ర్శించిన ఎన్టీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: NTR | ఈ మ‌ధ్య కాలంలో ఏ వేడుక అయిన స‌రే అభిమానుల గోల కామ‌న్‌గా మారింది. త‌మ ఫేవ‌రేట్ స్టార్స్ ఎదురుగా ఉంటే మిగ‌తా వాళ్ల‌ని మాట్లాడ‌నివ్వ‌కుండా తెగ హంగామా చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ Pawan kalyan ఈవెంట్స్‌కి వ‌చ్చిన‌ప్పుడు సీఎం సీఎం “CM CM” అంటూ అర‌వ‌డం, మిగ‌తా వారిని మాట్లాడనివ్వ‌కుండా చేయ‌డం మ‌నం చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్‌ని NTR కూడా సీఎం సీఎం CM CM అని అరుస్తూ మిగ‌తా వారికి ఇబ్బందిని క‌లిగ‌స్తున్నారు ఫ్యాన్స్. హైదరాబాద్‌లో Hyderabad జరిగిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ Arjun Son of Vyjayanthi మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఆ సమయంలో అభిమానులు చేసిన హడావుడి ఆయనకు కాస్త కోపం తెప్పించింది.

Advertisement
Advertisement

NTR | ఎన్టీఆర్ ఫైర్..

కల్యాణ్ రామ్‌తో Kalyan Ram కలిసి జూనియర్ ఎన్టీఆర్ వేదికపైకి వెళుతుండగా, మూవీ గురించి విజయశాంతి మాట్లాడారు. ఆ సమయంలో అభిమానులు ఎన్టీఆర్ అని సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు slogans చేస్తూ విజయశాంతి vijayshanti ప్రసంగానికి అడ్డు త‌గిలారు. విజ‌య‌శాంతి న‌వ్వుతూనే అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఆమె మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులపై చిన్నపాటి అసహనం little impatience ప్రదర్శించారు. మీరు ఇలాగే అరిస్తే నేను వెళ్లిపోతానంటూ అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ అన్నారు. వెంటనే విజయశాంతి ఎన్టీఆర్ చేయి పట్టుకుని తన పక్కకు తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు. అభిమానుల అభిమానం కంట్రోల్ చేయలేకపోతున్నామని విజయశాంతి అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ తన అభిమానులకు సైలెంట్‌గా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Arjun Son of Vyjayanthi | శ్రీవారిని దర్శించుకున్న కల్యాణ్​రామ్, విజయశాంతి

విజయశాంతి తన స్పీచులో భాగంగా ఈ మూవీ లైన్ గురించి చెప్పింది. ఓ ఫ్రెండ్ Friend కోసం మరో ఫ్రెండ్ ఎన్నో త్యాగాలు చేస్తాడు.. గర్ల్ ఫ్రెండ్ girlfriend కోసం కూడా యూత్ ఎంతో త్యాగం చేస్తుంది.. కానీ ఏ అమ్మకి ఏ కొడుకు కూడా ఇలాంటి త్యాగం చేయడు.. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.. అది నేను ఇప్పుడు చెప్పలేను.. సినిమా చూస్తే మీరు సర్ ప్రైజ్ ఫీల్ అవుతారు.. చాలా కొత్తగా ఉంటుంది సినిమా మీద హైప్ hype పెంచే ప్రయత్నం చేసింది విజయశాంతి. ఇక ఇదే ఈవెంట్ కళ్యాణ్ రామ్ స్పీచ్ Kalyan Ram’s speech చాలా స్వీట్ అండ్ సింపుల్‌గా ముగిసింది. మరి ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుద‌ల కానుండ‌గా, ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందో చూడాలి.

Advertisement