అట్టహాసంగా ఫేర్వెల్ డే వేడుకలు

0

అక్షరటుడే, బోధన్: పట్టణంలోని శ్రీ విజయసాయి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డిఐఈఓ రఘురాజ్, ఎంఈఓ నాగనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సుబ్బారావు, హనుమంతరావు, వేణు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.