అక్షరటుడే, ఆర్మూర్: మోర్తాడ్ మండలం పాలెం గ్రామ మాజీ సర్పంచ్, రైతు నాయకుడు ముత్యాల మనోహర్‌రెడ్డి పార్థివదేహానికి కొంపల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం పలువురు నివాళులర్పించారు. పసుపు బోర్డు సాధించేవరకు 12 ఏళ్లు చెప్పులు ధరించకుండా మనోహర్‌రెడ్డి తిరిగారని, ఎర్రజొన్న బకాయిల కోసం తిరుపతి వరకు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి, బూటకపు కేసులు బనాయించినా ధైర్యంగా నిలబడ్డ నేత అని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు సునీల్ రెడ్డి, వినయ్ కుమార్‌రెడ్డి, ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు వి.ప్రభాకర్, దేగం యాదాగౌడ్, మంథని గంగారం, లింగారెడ్డి, దేవారాం, సూరి ఉన్నారు.