అక్షరటుడే, కామారెడ్డి: పాల్వంచ తహశీల్దార్‌పై రైతులు గురువారం అదనపు కలెక్టర్ విక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి తహశీల్దార్‌ తీరుపై రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్య వివరించారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ విక్టర్ పాల్వంచ తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని విచారించారు. రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తహశీల్దార్‌ జయంత్ రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్‌ను బదిలీ చేయాలని రైతులు కోరారు. ఏడాదిగా తమ సమస్యలపై కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.