అక్షరటుడే, కోటగిరి: ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్మిన రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని పోతంగల్ లో రైతులు బుధవారం తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బజరంగ్ మాట్లాడుతూ.. వరి పంట కోసిన తర్వాత సరైన సమయంలో కాంటలు ప్రారంభం కాకపోవడం, వర్షాలు కురవడంతో ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇలాంటి రైతులను గుర్తించి వారికి కూడా ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మోహన్, నాగభూషణం, భీంరావు, విజయ్, నాగయ్య పాల్గొన్నారు.