అక్షరటుడే, కోటగిరి: ప్రభుత్వం ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని పోతంగల్ బస్టాండ్ వద్ద రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా.. ఒక్క గింజ వడ్లు కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పోతంగల్ చెక్ పోస్ట్ ను పరిశీలించడానికి వచ్చిన బోధన్ సబ్ కలెక్టర్ రోడ్డు పక్కన ఉన్న తడిసిన ధాన్యాన్ని పరిశీలించకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.