అక్షరటుడే, ఎల్లారెడ్డి : రైతులను రోడ్డు మీదకు తెచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ విమర్శించారు. షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని లింగంపేటలో అన్నదాతలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతులను ధనవంతులను చేస్తే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రోడ్లమీదకి తీసుకొచ్చారని విమర్శించారు. లింగంపేట మండల కేంద్రంలో 3,300 మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా 1,400 మందికి మాత్రమే అయిందని చెప్పారు. నియోజకవర్గంలో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు చనిపోతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం రుణమాఫీ చేయాలని తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు దివిటి రమేష్, సంజీవరెడ్డి, ముదాం సాయిలు, బొల్లు శ్రీకాంత్, నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, దాసరి పర్వయ్య, తదితరులు పాల్గొన్నారు.