అక్షరటుడే, బాన్సువాడ : సహకార సంఘం ఉద్యోగుల తప్పిదాలతో తమకు రుణమాఫీ కాలేదని ఆరోపిస్తూ వర్ని మండలం హుమ్నాపూర్ సహకార సంఘం ఎదుట రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి, సిబ్బందిని నిలదీశారు. తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో తప్పులు జరగడంతో రుణమాఫీకి దూరమయ్యామని ఆవేద వ్యక్తం చేశారు. సొసైటీ సిబ్బంది తీరుతో 50 మంది రైతులు నష్టపోయామని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.