ఆగి ఉన్న లారీని ఢీకొని.. తండ్రి కొడుకుల దుర్మరణం

0

అక్షరటుడే, ఆర్మూర్: వేల్పూర్ మండలం అంక్సాపూర్ శివారులో జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన మాడవేడి రవీందర్(55), మాడవేడి శివరాజ్(24)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఉదయం వీరిద్దరు టూ వీలర్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పండుగ పూట ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.