Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ (Adilabad) వైపు నుంచి మహారాష్ట్ర వెైపు వెళ్తున్న డీసీఎం లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్, అదనపు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Hyderabad - Srisailam Highway : హైదరాబాద్ – శ్రీశైలం నేషనల్ హైవేపై కొత్త అప్ డేట్.. అండర్ గ్రౌండ్ రోడ్డు రాబోతోందా?