పోషించే స్థోమతలేక.. కూతురిని అమ్మకానికి పెట్టిన తండ్రి

0

అక్షరటుడే, బాన్సువాడ: ముగ్గురు ఆడపిల్లలను పోషించే స్థోమత లేక ఓ తండ్రి కన్న కూతురిని అమ్మకానికి పెట్టిన ఘటన బాన్సువాడలో వెలుగుచూసింది. మాతా శిశు ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గ్రామానికి చెందిన శీను తన చిన్న కూతురుని తీసుకువచ్చి శుక్రవారం బాన్సువాడ ఆస్పత్రిలో అమ్మకానికి పెట్టాడు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా అక్కడి వైద్యుడు గమనించి అతడిని ప్రశ్నించాడు. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆడపిల్లలను పోషించే స్థోమతలేక చిన్న కూతురిని అమ్మడానికి వచ్చినట్లు తెలిపాడు. వైద్యుడు కాళిదాస్ బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ పేర్కొన్నారు.