Advertisement
అక్షరటుడే, ఆర్మూర్ : Crime: నందిపేట్ గ్రామనికి చెందిన పెయింటర్ నాగం రవి (52 ) చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్ విగ్రహాల ఇనుప స్టాండ్ల కోసం రవి నందిపేట ఊర చెరువులో దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Advertisement