అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) సూచించారు. హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ నిర్వాహకులతో గురువారం సీపీ సమావేశమై పలు సూచనలు చేశారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ర్యాలీలో డ్రోన్లు(Drones) వాడటం నిషేధమన్నారు.
విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, ఆర్య సమాజ్, ఏబీవీపీ, హిందు వాహిని సభ్యులు తమ సమస్యలను సీపీ దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో ట్రెయినీ ఐపీఎస్ సాయికిరణ్ పత్తిపాక, అదనపు డీసీపీ(స్పెషల్ బ్రాంచ్ ) శ్రీనివాస్ రావు, ఇన్ఛార్జి అదనపు డీసీపీ(అడ్మిన్) మస్తాన్ అలీ, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.