శంకర్​ భవన్​ విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్
శంకర్​ భవన్​ విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్
Advertisement

అక్షరటుడే, ఇందూరు: SHANKAR BHAVAN : నగరంలోని శివాజీ నగర్​ శంకర్​ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను సోమవారం ఫీల్డ్ ట్రిప్​కు తీసుకెళ్లారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే అంశంపై నాగారంలో ఉన్న డంపింగ్ యార్డ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్​ను సందర్శించారు.

శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్, యూనిట్ మేనేజర్ మాధవ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యర్థ పదార్థాలు, కూరగాయల వ్యర్థాలు తదితర వాటి నుంచి కంపోస్ట్ ఏ రకంగా తయారు చేస్తారో వివరించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | కలెక్టరేట్​ను ముట్టడించిన అంగన్​వాడీ కార్యకర్తలు

అనంతరం గుండారంలోని పేపర్ మిల్, అశోక్ సాగర్​లోని బయో డైవర్సిటీలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మల్లేశం, గంగా కిషన్, మాధవి, రాములు, శాంతాబాయి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement