Fighter Jet | కూలిన యుద్ధ విమానం

Fighter Jet | కూలిన యుద్ధ విమానం
Fighter Jet | కూలిన యుద్ధ విమానం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Fighter Jet | హర్యానాలోని పంచకులలో శుక్రవారం ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఇటీవల ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​కు చెందిన విమానాలు కూలిపోతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైమానికి దళానికి చెందిన ఫైటర్​ జెట్​ జాగ్వార్‌ కూలిపోయింది. అంబాలా ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఫైలెట్​ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా ఈ ఘటనపై ఎయిర్స్​ ఫోర్స్​ అధికారులు విచారణకు ఆదేశించారు. సాంకేతిక సమస్యతో విమానం కూలిపోయిందని తెలిపారు.

Advertisement