హైకోర్టులో ఆర్జీవీకి షాక్‌..

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ(ఆర్జీవీ)కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనను అరెస్టు నుంచి రక్షించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉన్నట్లయితే బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని సూచించింది. దీంతో పోలీసుల విచారణకు కొంత సమయమివ్వాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేయగా.. పోలీసుల ముందు అభ్యర్థన చేసుకోవాలని తెలిపింది. కాగా.. ‘వ్యూహం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పై ఆర్జీవీ ‘ఎక్స్‌’లో పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.