అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Indoor Tirumala | మోపాలం మండలం నర్సింగ్‌పల్లిలో గల ఇందూరు తిరుమల బ్రహ్మోత్సోవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లో ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు(Dil Raj), శిరీష్(Shireesh)తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నేశ, రచయిత చిన్ని కృష్ణ, బలగం ఫేం మధు, ఓదెల ఫేం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేవనాథ్ జియర్ స్వామి, గంగోత్రి రామానుజదాసు స్వామి, శిఖామణి ఆచార్య, రోహిత్ కుమారాచార్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.