అక్షరటుడే, వెబ్డెస్క్: Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఒక బెస్ట్ స్కీమ్ ను తీసుకొచ్చింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. వాళ్లకు స్వయం ఉపాధి కోసం, సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునేలా ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లను కేటాయించింది. కనీసం 5 లక్షల మంది అర్హులైన నిరుద్యోగులను గుర్తించి వాళ్లకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఈ సాయాన్ని ప్రభుత్వం నిరుద్యోగులకు అందించనుంది. మార్చి 17 నుంచి అప్లికేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Rajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగ సమస్యను తగ్గించే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి వాళ్లను స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. అర్హులైన నిరుద్యోగులు ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 18 ఏళ్లు నిండిన వాళ్లు, 35 సంవత్సరాల లోపు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.