అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా ఏటీఎంల వినియోగం గణనీయంగా తగ్గినట్లు ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. వినియోగంలో లేని కారణంగా ఏటీఎంలను బ్యాంకులు తగ్గిస్తూ వస్తున్నాయన్నారు. డిజిటల్‌ బ్యాకింగ్‌, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ పెరిగిన కారణంగానే నగదు చలామణి తగ్గిందని వారు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 2,19,000 ఏటీఎంలు ఉండగా సెప్టెంబర్ 2024 నాటికి 2,15,000కు ఏటీఎంలు తగ్గాయి.