అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలో తిలక్ గార్డెన్ చౌరస్తా వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ విద్యుత్తు స్తంభానికి ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. గ్లామర్ హోటల్ సమీపంలో ఉన్న పోల్ కు మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పక్కనే ఉండే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మంటలను అదుపు చేశారు. విద్యుత్తు అధికారులు ముందు జాగ్రత్తగా సరఫరాను నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలపై పరిశీలిస్తున్నారు.