అక్షరటుడే, నిజామాబాద్: నగరంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద పోస్టాఫిస్ పక్క వీధిలో ఉన్న ఓ భవనంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలు చెలరేగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే పెద్ద మొత్తంలో సామాగ్రి, వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. అయిదు లక్షల నగదు మంటల్లో కాలిపోయినట్లు బాధితుడు షేక్ జావేద్ తెలిపాడు.
Advertisement
Advertisement