Star Hero | ప్రముఖ హీరో ధనుష్​ మూవీ సెట్​లో అగ్నిప్రమాదం

Star Hero | ప్రముఖ హీరో ధనుష్​ మూవీ సెట్​లో అగ్నిప్రమాదం
Star Hero | ప్రముఖ హీరో ధనుష్​ మూవీ సెట్​లో అగ్నిప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Star Hero | కోలీవుడ్​ Kollywood స్టార్​ హీరో ధనుష్ Danush​ మూవీ సెట్​లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధనుష్​ స్వీయ దర్శకత్వంలో ఇడ్లి కడై (idly kadai) అనే సినిమా తీస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ nitya menon​ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్​ వేగంగా సాగుతోంది.

Advertisement

థేని జిల్లాలోని ఆండిపట్టీలో సెట్స్ మధ్య షూటింగ్ నిర్వహిస్తున్నారు. 20 రోజులుగా ఇక్కడే చిత్రీకరణ జరుగుతుండగా సెట్స్​లో మంటలు వ్యాపించాయి. షూటింగ్​ ముగిసిన కొద్దిసేపటికే సెట్స్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. కాకపోతే సెట్​ పూర్తిగా కాలి బూడిదైంది.

కాగా.. ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 10న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్​ పూర్తి కాకపోవడంతో అక్టోబర్​ 1న రిలీజ్​ చేస్తామని మేకర్స్​ ప్రకటించారు. ఈ క్రమంలో మూవీ షూటింగ్​ శరవేగంగా చేపడుతున్నారు.

Advertisement