అక్షరటుడే, ఇందూరు: దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. సోమవారం అబుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్ ఛార్జి నాగురావ్, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.