అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఫిషరీస్ జిల్లా అధికారి శ్రీపతి అన్నారు. బుధవారం లింగంపేట మండలం బాయంపల్లిలోని పటేల్ చెరువులో మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు అందరికీ గుర్తింపుకార్డులు అందిస్తామని, బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్ సత్యనారాయణ, ఆడిటర్ శ్రీనివాస్, డైరెక్టర్ సాయిలు, లింగంపేట మండలం తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు సాయికుమార్, తదితరులున్నారు.
YellaReddy | మత్స్యకారులు ఆర్థికంగా వృద్ధి చెందాలి
Advertisement
Advertisement