అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smart Phones | స్మార్ట్‌ఫోన్ ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. ఏ సమాచారం కావాలన్నా చిటికెలో లభ్యమవుతుంది. అయితే సమాచారం కోసం కాకుండా వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడానికి చాలామంది స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. భారతీయులు రోజుకు సగటున ఐదు గంటలు five hours ఫోన్ చూస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది. 2024లో మొత్తం భారతీయులు 1.1 లక్షల కోట్ల గంటలు స్మార్ట్ఫోన్లలో smartphones గడిపినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
Smart Phones | చిన్నా పెద్ద తేడా లేదు..
దేశంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు ఫోన్లకు బానిసలు అవుతున్నారు. చాలా మంది పిల్లలు children ఫోన్లో వీడియోలు పెడితే గాని అన్నం తినడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. యువత అయితే నిత్యం సోషల్ మీడియాలో social media గడిపేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో Instagram రీల్స్ చూస్తూ సమయం వృథా చేస్తున్నారు. పెద్దలు సైతం బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఫోన్లలో నిమగ్నవుతున్నారు.
Smart Phones | కంటి సమస్యలు
ప్రస్తుతం బయట పార్క్‌కు వెళ్లినా.. హోటల్‌కు వెళ్లిన సాధారణంగా కనిపించే దృశ్యం ఎవరి ఫోన్లలో వారు తలలు పెట్టి చూస్తుండడం. అయితే నిత్యం ఫోన్లలో బ్లూ స్క్రీన్ చూస్తుండడంతో చాలా మంది కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. చిన్న పిల్లలకూ అద్దాలు వస్తున్నాయి. స్మార్ట్స్ ఫోన్లు అధికంగా వాడడం వల్ల కంటి సమస్యలే కాదు జ్ఞాపకశక్తి సైతం తగ్గుంతుందని నిపుణులు చెబుతున్నారు.