అక్షరటుడే, బాన్సువాడ: నిజాంసాగర్ కాలువలో పడి ముగ్గురు గల్లంతైన ఘటన వర్ని, చందూర్ మండలాల్లో చోటు చేసుకుంది. వర్ని మండలం అఫంది ఫారంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో స్నానానికి వెళ్లి నారాయణ, విజయ్ గల్లంతయ్యారు. అలాగే చందూర్ శివారులోని సాగర్ కాల్వలో పడి విష్ణువర్ధన్ అనే వ్యక్తి గల్లంతైనట్లు వర్ని ఎస్సై కృష్ణ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు మెండోరా మండలం పోచంపాడ్ నదిలో నీట మునిగి యువకుడు మహేశ్ మృతి చెందాడు. ఉమ్మెడ సమీపంలోని నదిలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మాధవ్ మృత్యువాత పడ్డాడు. ఒకే రోజులో జిల్లా వ్యాప్తంగా అయిదుగురు నీట మునిగి మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.