
అక్షర టుడే, వెబ్ డెస్క్ NTR : ఒక సినిమా హిట్ అవ్వడానికి రీజన్స్ ఎన్ని ఉంటాయో ఫ్లాప్ అవ్వడానికి దానికి మించి ఎక్కువ రీజన్స్ ఉంటాయి. హిట్ అయ్యింది అంటే నా వల్లే అని చెప్పి ఫ్లాప్ అయితే పక్కన వాళ్ల మాట వినడం వల్లే అని కొందరు చెబుతుంటారు. ఐతే ఒకప్పటి సినిమాల్లో అలా మాట విని మంచి కథను చెడగొట్టి ఫ్లాప్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి (NTR Shakti Movie) ఎన్టీఆర్ శక్తి సినిమా.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో (Vyjayanthi Movies Banner) అశ్వనిదత్ నిర్మించిన ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు. అప్పటికే తారక్ తో కంత్రి సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్న మెహర్ రమేష్ (Meher Ramesh) ఈసారి శక్తితో సెన్సేషన్ సృష్టించాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. శక్తి సినిమా విషయంలో డైరెక్టర్ మెహర మేష్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
NTR : సినిమా ఫ్లాప్ కి రీజన్..
ఐతే ఆ సినిమా ఫ్లాప్ కి మరో రీజన్ తన కథను మార్చడమే అన్నాడు (Meher Ramesh) మెహర్ రమేష్. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన శక్తి సినిమా ఫ్లాప్ (Shakti movie flop) అవ్వడం వెనక నిర్మాతల జోక్యమే అని అన్నాడు. అంటే ఆ సినిమా నిర్మించిన అశ్వనిదత్ ఆ సినిమా కథలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్లే సినిమా అల వచ్చిందని మెహర్ రమేష్ వాదన.
సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఇలాంటివి చెప్పడం తేలికే. ఐతే మెహర్ రమేష్ అనుకున్న అసలు కథ ఏంటి మరి అది ఎందుకు నిర్మాతలకు నచ్చలేదు అన్నది ఆడియన్స్ చర్చిస్తున్నారు. ఇప్పటికి కూడా వైజయంతి బ్యానర్ డిజాస్టర్ సినిమా ఏది అంటే అశ్వనిదత్ శక్తి సినిమా అనే చెబుతారు. ఆ సినిమా అంతగా లాసులు తెచ్చింది. అయితే శక్తి సినిమాపై మెహర్ రమేష్ కామెంట్స్ పై ఆ నిర్మాత ఫాలోవర్స్ మాత్రం రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఐతే ఇందులో ఏది నిజం అన్నది పక్కన పెడితే శక్తి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మర్చిపోలేని ఒక సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు.