అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flight | డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో బ్రేక్‌లు పడకపోవడంతో విమానం(Flight) రన్‌వేపై ఆగాల్సిన చోట ఆగలేదు. సిమ్లా(Simla)లోని జుబ్బర్‌హట్టి ఎయిర్‌పోర్ట్(Airport)లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
హిమచల్ ప్రదేశ్(Himachal Pradesh) డిప్యూటీ సీఎం ముఖేశ్ అగ్నిహోత్రి, డీజీపీ అతుల్ వర్మ సహా 44 మంది ప్రయాణికులు అలయన్స్ ఎయిర్(Alliance Air) విమానంలో ఉన్నారు. ఆ విమానం ఢిల్లీ(Delhi) నుంచి సిమ్లా మీదుగా ధర్మశాల(Dharmashala) వెళ్లాల్సి ఉంది. అయితే సిమ్లాలో ల్యాండింగ్(Landing) అయ్యే సమయంలో వేగం తగ్గించినప్పటికి సాంకేతిక లోపంతో బ్రేక్‌లు పడలేదు. దీంతో విమానం ఆగాల్సిన చోట ఆగకుండా ముందుకు వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
కాగా పైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో విమానం నిలిచిపోయింది. దీంతో తర్వాత ధర్మశాలకు ఆ విమానాన్ని రద్దు చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ విమానం రన్ వే అంచుకు చేరిందన్నారు. విమానం నిలిచిపోయిన తర్వాత కూడా 25 నిమిషాల పాటు తాము అందులోని ఉండాల్సి వచ్చిందన్నారు.