అక్షరటుడే, వెబ్డెస్క్ : Flight ticket | విమానంలో ప్రయాణించాలని ఎంతో మంది కలలు కంటారు. ఒక్కసారైనా అలా ఆకాశంలో విహరించాలని అనుకుంటారు. అయితే ఫ్లైట్ జర్నీ light journey ఖరీదైనది కావడంతో చాలా మంది తమ కలలకు dreams కళ్లెం వేసుకుంటారు. అయితే అలాంటి వారి కోసం ఎయిర్ ఇండియా Air India బంపర్ ఆఫర్ bumper offer ప్రకటించింది. గతంలో సైతం పలు విమానయాన సంస్థలు airlines ప్రత్యేక సందర్భాల్లో తక్కువ ధరకు ఫ్లైట్ టికెట్లు flight tickets అందించాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ Air India Express కూడా సమ్మర్ ఫ్లాష్ సేల్ పేరుతో రూ.1,346 విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.
Flight ticket | బంపరాఫర్
మరి కొద్దిరోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది పిల్లలతో టూర్లకు వెళ్లాలని ప్లాన్లు వేసుకుంటున్నారు. అనేక సంస్థలు సమ్మర్ స్పెషల్ టూర్ summer special tour ప్యాకేజీలను అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే విమానంలో తక్కువ ధరలో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం ఎయిర్ ఇండియా Air India సమ్మర్ ఫ్లాష్ సేల్ Summer Flash Sale పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రూ. 1,346 నుంచే టికెట్ ధరలు ticket prices ప్రారంభం అవుతాయి.
Flight ticket | ఆఫర్ వివరాలు..
- ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీలు: రూ. 1346 నుంచి ప్రారంభం
- ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఛార్జీలు: రూ. 1,498 నుంచి ప్రారంభం
- బుకింగ్ వ్యవధి : ఏప్రిల్ 15 (00:00 గంటలు) నుంచి ఏప్రిల్ 18, 2025 (23:59 గంటలు) వరకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు.
- ప్రయాణ వ్యవధి : ఏప్రిల్ 21, 2025 (00:00 గంటలు) నుంచి సెప్టెంబర్ 20, 2025 (23:59 గంటలు) లోపు ప్రయాణించే వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
Flight ticket | వారికి మాత్రమే..
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ Air India Express అధికారిక వెబ్‌సైట్ (www.airindiaexpress.com), యాప్ ద్వారా లాగిన్ అయిన లాయల్టీ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఆఫర్ పరిమిత కాలానికి limited period మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటిగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు అమ్ముడైతే, సాధారణ ధరలు regular prices కనిపిస్తాయి.