అక్షరటుడే, ఆర్మూర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు పెరిగింది. దీంతో అధికారులు 15 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 86,442 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో అవుట్ ఫ్లో ఉన్నట్లు ఏఈఈ కొత్త రవి తెలిపారు.