Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో నేడు ఫ్లై ఓవర్లు బందు కానున్నాయి. డిసెంబర్ 31 దృష్ట్యా రాత్రి 10 గంటల తర్వాత ఫ్లై ఓవర్ల పైకి వాహనాలను అనుమతి నిరాకరించనున్నారు. బైక్ రేసులు, మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్లను మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు.
Advertisement