అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఫుడ్ డెలివరీ దిగ్గజ సంస్థ జొమాటో మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. దీని కోసం కొత్తగా డిస్టిక్ పేరిట యాప్ లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా డైనింగ్ సర్వీసెస్, మూవీ టికెట్స్, ఈవెంట్లను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే టికెట్ బుకింగ్ రంగంలో ఉన్న బుక్ మై షోతో డిస్టిక్ పోటీ పడనుంది.