అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ కొత్త సేవలను ప్రారంభించింది. పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాలను ధ్రువీకరించేందుకు నూతనంగా ‘స్విగ్గీ సీల్‌’ను తీసుకొచ్చింది. ఈ సేవలు ప్రస్తుతం పుణేలో అందుబాటులో ఉన్నాయి. నవంబర్‌ నాటికి 650 నగరాలకు క్రమక్రమంగా విస్తరిస్తామని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. పరిశుభ్రమైన ఆహారం, నాణ్యతా ప్రమాణాలు, మంచి ప్యాకింగ్‌ ప్రమాణాలను పాటించే రెస్టారెంట్లకు కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ బ్యాడ్జ్‌ను జారీ చేస్తారు. కాగా, ఈ కొత్త ఆలోచననకు రెస్టారెంట్ల నుంచి మంచి స్పందన వస్తోంది.