FOOD FESTIVAL | వాసవి హైస్కూల్‌లో ఫుడ్‌ ఫెస్టివల్‌
FOOD FESTIVAL | వాసవి హైస్కూల్‌లో ఫుడ్‌ ఫెస్టివల్‌
Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: FOOD FESTIVAL | పట్టణంలోని వాసవి హైస్కూల్‌లో మంగళవారం ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ‘మంట లేకుండా వంట’(MANTA LEKUNDA VANTA) అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈవో నాగేశ్వరరావు ఫుడ్‌ ఫెస్టివల్‌(FOOD FESTIVAL)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను స్టాళ్ల(STALS)లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌ కుమార్‌, సిబ్బంది శ్వేత, నాగరాజ్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement