అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలో తాగునీటి నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అమృత్ పథకంలో భాగంగా రూ.52 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో వివిధ వార్డుల్లో తాగునీటి ట్యాంకుల ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, నార్ల రవీందర్, నగేశ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.