అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 100 కోట్లు ఇచ్చి తెలంగాణకు మొండిచేయి చూపడంపై మాజీ మంత్రి హరీశ్‌రావ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సోషల్‌మీడియాలో ట్వీట్‌ చేశారు. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రావాల్సిన వాటా కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్‌లో ఘోరంగా విఫలమయ్యాయన్నారు.