అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మన స్టాక్ మార్కెట్లలో సీన్ రివర్సవుతోంది. ఇన్నాళ్లూ అమ్మకాలతో మార్కెట్ పతనానికి కారణమైన పారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మూడు రోజులుగా నెట్ బయ్యర్లుగా నిలుస్తున్నారు. ఈనెల 25న రూ. 9,947 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన ఎఫ్‌ఐఐలు.. 26న రూ. 1,157 కోట్ల స్టాక్స్ కొన్నారు. బుధవారం నామమాత్రంగా రూ. 7.78 కోట్ల స్టాక్స్ కొనుగోలు చేశారు. కాగా గత రెండు సెషన్లలో నెట్ సెల్లర్లుగా నిలిచిన డీఐఐలు.. బుధవారం రూ. 1,301 కోట్ల స్టాక్స్ కొనుగోలు చేశారు. డీఐఐలు ఈనెల 25న రూ. 6,907 కోట్లు, 26న రూ. 1,910 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం తెలిసిందే.