అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు అటవీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుపడింది. సిరికొండ సెక్షన్ అధికారి వసంత్ రావు, బేస్ వాచర్ నరేందర్‌ను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ‘సిరికొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణ జరుగుతోంది, కొందరు ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేస్తున్నారని’ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కాగా.. అటవీ భూముల ఆక్రమణలను తొలగించే క్రమంలో గిరిజనులతో గొడవ జరిగింది. అనంతరం వారిపై స్థానిక స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సెక్షన్ అధికారి వసంత్‌రావుతో పాటు బేస్ వాచర్ నరేందర్ నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించి విధుల నుంచి తొలగించారు.