అక్షరటుడే, వెబ్ డెస్క్: అటవీ భూములు ఆక్రమించడం, చెట్లను నరికివేయడం చట్టరీత్యా నేరమని.. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని అటవీ రేంజ్ అధికారులు సంజయ్ గౌడ్, రవిమోహన్ భట్ పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తండాలో గురువారం ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీ చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వన్యప్రాణులు, చెట్లను సంరక్షించాలని కోరారు.