అక్షరటుడే, ఆర్మూర్: బతుకమ్మ చీరల పంపిణీ ఎక్కడ అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పండగలపై రేవంత్ సర్కార్ కన్నెర్ర చేసిందని విమర్శించారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం బతుకమ్మ అన్నారు. కేసీఆర్ మన పండగలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని మతాల వారిని గౌరవించారన్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. పండగలపై వివక్ష చూపెడితే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.