అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పడకుండా బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేసి విజయం సాధించిదని జెడ్పీ మాజీ ఛైర్మన్ విఠల్‌రావు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతంర వారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై రూ. 18,500 కోట్ల భారం మోపేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. దీనికి సంబంధించి బహిరంగ విచారణలో బీఆర్‌ఎస్ వ్యతిరేకించి విజయం సాధించిందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాంకిషన్‌రావు, సిర్పరాజు, సుదాం రవిచందర్, దండుశేఖర్, సత్యప్రకాశ్, మురళి, రాజు, ఇక్బాల్, గంగమణి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపును అడ్డుకున్నాం: బీఆర్‌ఎస్
Advertisement
Advertisement