అక్షరటుడే, వెబ్ డెస్క్: ఏడాది కాంగ్రెస్ పాలనపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ఇన్ని రోజులు మౌనంగా, గంభీరంగా చూస్తున్నానని పేర్కొన్నారు. తాను చెప్పినా ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ ను గెలిపించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొట్టేటట్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తమ విజయం ప్రజల విజయం కావాలని చెప్పుకొచ్చారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు ఓటింగ్ పెడితే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. ఇక తెలంగాణ శక్తి ఏంటో చూపించి కాంగ్రెస్ వాళ్ల మెడలు వంచుతామన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాఖ్యానించారు.
Advertisement
Advertisement